- Samayam News
- Telugu News
- destinations
- India's Most Beautiful Villages That You Must Visit Once In Your Life 2020
ఇండియాలో అత్యంత అందమైన గ్రామాలు ఇవే... ఎప్పుడైనా చూసారా?
భారతదేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు అని, ఈ భూమ్మీద అత్యంత అందమైన గ్రామాలు కొన్ని మన దేశంలోనే ఉన్నాయని చెబుతుంటారు. ఈ గ్రామాల గురించి తెలుసుకుంటే మీరు కూడా సరిగ్గా ఈ మాటలతో ఏకీభవిస్తారు. భారతదేశం యొక్క అసలైన అందాన్ని, ఆధునికత అంటుకోని సామాన్య గ్రామీణ జీవనాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ఈ గ్రామాలను చూస్తే మీరు ఓ పాత ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి చెందుతారు. గొప్ప సంస్కృతి, ఆచరణల కారణంగానే వీటికి ఈ ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. సాధారణ పర్యాటక మార్గాలకు దూరంగా దాగి ఉన్న ఈ గ్రామాలను అన్వేషించడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నగర జీవితానికి దూరంగా శాంతి, ప్రశాంతతను చేకూర్చే ఈ అందమైన గ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతకీ ఆ గ్రామాలు ఏమిటి ఎక్కడ ఉన్నాయి అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం..
జంజెలి, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ లోని ఈ చిన్న జంజెలి గ్రామం దేశంలోని అత్యంత సుందరమైన గ్రామాల్లో ఒకటి. మండి జిల్లాలో ఉన్న ఈ గ్రామం నగర వాణిజ్య జీవనానికి దూరంగా, ప్రశాంతతను కోరుకునే వారికి గొప్ప గమ్యస్థానంగా నిలుస్తుంది. ఇక్కడి రోడ్ల వెంబడి ఉండే కేఫ్ లు లేదా దుకాణాల వద్ద కూర్చుని సూర్యుడి వెలుగులో సేదతీరడం ఎంతో హాయిగా అనిపిస్తుంది. శిఖరి మాత దేవాలయం వంటి అనేక ఆలయాలను ఇక్కడ సందర్శించవచ్చు. సాహస ప్రేమికులకు హైకింగ్, ట్రెక్కింగ్, నైట్ సఫారీ వంటి అనేక బహిరంగ క్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి.
మవ్లినాంగ్, మేఘాలయ
మేఘాలయ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన చిన్న గ్రామం మవ్లినాంగ్. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రంగా ఉండే గ్రామంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామంలో శుభ్రతను చూస్తే మీరు ఆశ్చర్యపడకమానరు. ఈ గ్రామాన్ని అన్వేషించడంతో పాటు అక్కడి స్థానికులను ప్రేమగా పలకరించడం ద్వారా వారి జీవన విధానం, సంస్కృతి గురించి మరింత తెలుసుకోవచ్చు. సందర్శకులకు ఆ గ్రామస్తులు ఎంతో సాదరంగా ఆతిధ్యమిస్తారు. పర్యావరణ హితంగా జీవిస్తున్నందుకు వారెంతో గర్వపడతారు. ఈ గ్రామంలో ఎత్తైన టవర్ ఎక్కి 360 డిగ్రీల కోణంలో గ్రామ అందాలను వీక్షించవచ్చు. వెయ్యి సంవత్సరాలకు పైగా వయస్సు కలిగిన వృక్షాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.
మలన, హిమాచల్ ప్రదేశ్
కుల్లు వ్యాలీలో ఉన్న అందమైన ప్రాచీన గ్రామం మలన. ఇక్కడి నుంచే నాణ్యమైన మలన క్రీమ్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ గ్రామంలో కొద్ది మంది మాత్రమే నివసిస్తున్నప్పటికీ సాహస ప్రేమికులకు, పర్వతారోహకులకు ఇది ప్రముఖ గమ్యస్థానంగా మారింది. తాజా గాలి, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల కోసం మలనను తప్పకుండా సందర్శించాలి. ఇక్కడి ప్రజలు వారి ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను, ప్రాచీన పద్ధతులను ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటారు. సౌకర్యవంతమైన పర్యటన కోసం కుల్లులో హోటల్ గదిని బుక్ చేసుకుని ఇక్కడికి వెళ్లి రావచ్చు.
రవంగ్లా, దక్షిణ సిక్కిం
స్వచ్ఛమైన ప్రకృతి అందాలతో, మంచుతో కప్పబడిన కాంచన్ జుంగా పర్వత శిఖరాల నేపధ్యంలో రవంగ్లా గ్రామం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఉత్కంఠభరితమైన లోయలు, లోతైన హిమాలయన్ అడవులతో నిండి ఉండే ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు ఓ స్వర్గధామంలా అనిపిస్తుంది. వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలంతో ఈ ప్రాంతం సందర్శకుల మనసు దోచుకుంటుంది. అంతేకాదు ఇక్కడ అనేక రకాల అరుదైన హిమాలయన్ పక్షులను కూడా చూడవచ్చు. పక్షి ప్రేమికులు దీనిని ఎంతో ఇష్టపడతారు.
నకో, లాహౌల్ స్పితి
అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ చిన్న కుగ్రామంలో అన్వేషించేందుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇండియా-చైనా సరిహద్దు వెంబడి ఉండే నకో గ్రామం సుందరమైన సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలతో నిండి ఉంటుంది. శీతాకాలంలో ఈ గ్రామం పూర్తిగా మంచుతో కప్పబడి కనిపిస్తుంది. ఆ సమయంలో స్కీయింగ్ వంటి క్రీడలకు ఇది అనువైన ప్రదేశంగా మారుతుంది. పురాతన మఠాలు, బోటింగ్ వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి.
Read Also: ఇండియా చిట్టచివరి గ్రామం 'మనా' గురించి మీకు తెలియని విషయాలు
లచెన్, సిక్కిం
సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో లచెన్ గ్రామం ఉంటుంది. ఈ అందమైన గ్రామం గురించి సిక్కిమీస్ ప్రభుత్వం ఇప్పటికే పెద్ద స్థాయిలో ప్రచారం కూడా చేస్తుంది. దేశంలోని అత్యంత సుందరమైన దృశ్యాలను అందించే గ్రామాల్లో ఒకటైన లచెన్ లో మంచు పర్వత శిఖరాలు, పచ్చని వాతావరణం సందర్శకులను మైమరపిస్తాయి. ప్రాచీన మఠాలతో పాటు గొప్ప ట్రెక్కింగ్ ట్రయల్స్ ను కూడా ఇక్కడ ఆనందించవచ్చు. గొర్రెలు, యాక్ ల నుంచి ఉన్ని నూలు ఎలా తయారు చేస్తారనే అంశాలను మీరు ఇక్కడ ప్రత్యక్ష్యంగా చూసి తెలుసుకోవచ్చు. సాహసాల పట్ల ఆసక్తి గల వారు యుమ్తాంగ్ వ్యాలీ నుంచి రెండు రోజుల ట్రెక్ ద్వారా ఈ గ్రామానికి వెళ్లవచ్చు. లచెన్ లో వసతి కోసం హోటల్ సదుపాయం కూడా ఉంటుంది. వీటిని ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు.
చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్
ఇండో-చైనా సరిహద్దులో ఉన్న మరో గ్రామం చిట్కుల్. అద్భుతమైన మంచు పర్వతాల దృశ్యాలను ఈ గ్రామం అందిస్తుంది. ఉత్కంఠభరితమైన ప్రకృతి అందాలకు ఇది ప్రవేశ ద్వారంలా అనిపిస్తుంది. నిర్మలమైన వాతావరణం, పర్వతాలు, పచ్చిక భూములు, నదులు, అరణ్యాలతో చిట్కుల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సందర్శకులు ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారు. బుద్దిస్ట్ ఆలయంతో సహా అనేక ప్రధాన ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. అడవుల్లో పర్వతారోహణతో పాటు అభయారణ్యం సందర్శన కోసం ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు.
జీరో, అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ లోని జీరో వ్యాలీలో జీరో గ్రామం ఉంది. పైన్ కొండలు, సుందరమైన గట్లు, వరిపొలాలతో నిండిన అన్యదేశ గ్రామం ఇది. అద్భుతమైన వృక్షజాలం, జంతుజాలంతో ఈ గ్రామం నిండి ఉంటుంది. అంతేకాదు సాహసాలను ఇష్టపడే వారు పర్వతారోహణలతో పాటు మంత్రముగ్ధుల్ని చేసే గుహలను కూడా అన్వేషించవచ్చు. ప్రకృతి, సాహస ప్రేమికులకు ఇది ఓ స్వర్గంధామం అని చెప్పవచ్చు. మీరు ఇక్కడి గిరిజన జీవనం గురించి తెలుసుకోవాలంటే జీరో వ్యాలీలో ఒళ్లంతా పచ్చబొట్లతో నిండి ఉండే అపటని గిరిజనులను కలుసుకోవాలి. తద్వారా మీరు వారి సంస్కృతి, సాంప్రదాయాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. తల్లీ వ్యాలీ వన్యప్రాణి అభయారణ్యం వంటి అనేక ప్రదేశాలు ప్రకృతి, వన్యప్రాణుల యొక్క గొప్ప దృశ్యాలను అందిస్తాయి.
Read Also: ఇండియాలో అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన అద్భుతమైన ద్వీపాలు
సూచించబడిన వార్తలు
Trending News:
భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు
యూఏఈ వేదికగా జరగనున్న అండర్-19 ఆసియాకప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం.
నేను చెప్పానా సార్! మన మేనిఫెస్టోతో ఏ పార్టీ మేనిఫెస్టో సరితూగదని..!!
నేను చెప్పానా సార్! మన మేనిఫెస్టోతో ఏ పార్టీ మేనిఫెస్టో సరితూగదని..!!
బంగారం భారీగా తగ్గిందోచ్..
Gold Price Today: పిసిడి ప్రియుల ఎదురుచూపులకు ఫలితం దక్కింది.
మనల్ని కాపీ కొడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పండి!
Notification.
సాక్షి, తెలంగాణభవన్: తనను ఏదో ఒక కేసు...
జైపూర్: రాజస్థాన్‌లోని డియోలీ-యునియ...
సాక్షి, తాడేపల్లి: ఏపీ పోలీసులు తమ వనర...
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండర�...
ముంబై: విభజన పేరుతో డిప్యూటీ సీఎం దేవ�...
Gold Price Today: వరుస తగ్గింపులతో బంగారం.. కొను�...
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచ సెక్యూలర�...
సాక్షి, హైదరాబాద్: అధికారులపై దాడి అన�...
ముంబై: మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి �...
సాక్షి, తాడేపల్లి: నేడు బాలల దినోత్సవ�...
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో �...
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ(అజిత్ పవా�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ఎన...
Select Your Preferred Category to see your Personalized Content
- ఆంధ్రప్రదేశ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- పర్సనల్ ఫైనాన్స్
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- డింగ్ డాంగ్ 2.0
- గరం గరం వార్తలు
- యూట్యూబ్ స్పెషల్
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
Most Beautiful Village: దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?
Published Sun, Sep 17 2023 11:03 AM | Last Updated on Sun, Sep 17 2023 12:18 PM
దేశంలోని పలు నగరాల తళుకుబెళుకులను మన చూసేవుంటాం. కానీ దేశంలోని అత్యంత అందమైన గ్రామాలను చూసివుండం. ఇప్పుడు మన దేశంలోని అందమైన గ్రామాలను దర్శిద్దాం.
మవ్లిన్నోంగ్ (మేఘాలయ) మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉన్న మావ్లిన్నోంగ్.. ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం. దీనిని దేవుడి తోట అని కూడా పిలుస్తారంటే దీని అందాలను అంచనా వేయవచ్చు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం ఉండదు. వెదురుతో చేసిన డస్ట్బిన్లను ఇక్కడ ఉపయోగిస్తారు. ఖిమ్సర్ (రాజస్థాన్) చుట్టూ స్వచ్ఛమైన గాలి, ఇసుకతో కూడిన గ్రామం ఇది. ఊరి మధ్యలో సరస్సు కనిపిస్తుంది. గ్రామ సమీపంలో అందమైన చెట్లు ఉంటాయి. అందమైన గుడిసెలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని ఈ గ్రామాన్ని ఇసుక దిబ్బల గ్రామం అని కూడా అంటారు. ఈ గ్రామం అందమైన రిసార్ట్‌ను తలపిస్తుంది. ఇక్కడ దాదాపు 300 నుంచి 400 అడుగుల ఎత్తులోని భారీ మట్టి దిబ్బలు ఉన్నాయి.
కొల్లెంగోడ్ (కేరళ) పచ్చదనం, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ చిన్న గ్రామం ఎంతో శుభ్రంగా ఉంటుంది. సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన కొల్లెంగోడ్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.
Add a comment
Related news by category.
- డాక్టర్‌పై ఏడు సార్లు కత్తితో దాడి ఘటన.. కుమారుడ్ని సమర్థించిన తల్లి చెన్నై: తన తల్లికి సరిగ్గా వైద్యం చేయలేదని కోపంతో ఆమె కుమారుడు విఘ్నేష్ డాక్టర్‌పై ఏడుసార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేష్‌ని సమర్థిస్తూ ఆమె తల్లి మాట్లాడారు. అయ్యా.. నా మీదున...
- ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే.. స్వల్ప తేడాతో బీజేపీపై విజయం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి కొత్త మేయర్‌గా ఎన...
- ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’.. విజేతలు వీరే ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ గురువారం ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ విజేతలను ప్రకటించింది. ఎకనామిక్స్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సె...
- తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో స్టేజ్-3 ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి కి చేరింది. రెండు రోజులుగా గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరిలో కొనసాగుతోంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం రాజధానిల...
- విద్యార్థుల ఆందోళనతో అట్టుడికిన యూపీ.. వెనక్కి తగ్గిన యోగి సర్కార్ లక్నో : విద్యార్థుల ఆందోళనతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్ వెనక్కి తగ్గింది. రెండ్రోజుల పాటు రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. యూపీపీఎస్సీ...
Related News By Tags
- ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామం, మనదేశంలోనే.. ఎక్కడుందంటే? ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని...
- ‘మా ఊరికి రావద్దు.. అన్ని ఓట్లూ నోటాకు వేసేస్తాం’ ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే ఊపందుకుంటోంది కానీ కేరళ రాష్ట్రం కన్నూర్‌లోని నడువిల్ గ్రామ వాసులు మాత్రం ప్రచారానికి నో చెబుతున్నారు. కారణం అధ్వాన్నమైన రోడ్లు. మెరుగైన రోడ్లు వేయనందుకు నిరసనగా తమ గ్రామం...
- భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యిందో తెలుసా! కేక్ అనేది మన సంప్రదాయ వంటకం కాదు. బ్రిటీష్ వాట్ల నుంచి వచ్చిందే. అయితే మన దేశంలో మొట్టమొదటి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యింది? ఎవరు తయారు చేశారో వింటే ఆశ్చర్యపోతారు. పైగా ఆ కాలంలో కేక్ తయారీకి కా...
- మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే.. కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయనే వార్తలు మళ్ళీ భయాన్ని కలిగిస్తున్నాయి. జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ట్రాల్లో వ్యాప్తిలో వుంది. కేరళలో 300 కేసులు,తెలంగాణలో 14 కేసులు న...
- భారత్‌లో కరోనా.. JN.1 ప్రమాదకారా? దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజా కేసులపై మంగళవారం అప్డేట్ ఇచ్చింది. 142 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970క...
స్టేజీపై ట్రోఫీ అందుకుంటున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? (ఫోటోలు)
భార్యకు స్టార్ హీరో స్పెషల్ విషెస్.. ఏకంగా ఐ లవ్ యూ చెబుతూ!
చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న సీరియల్ బ్యూటీ.. ఎంత క్యూట్‌గా ఉన్నారో?
బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ - రేటెంతో తెలుసా?
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు
Amarnath: అబద్ధాలతో ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టించారు
కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు: పట్నం నరేందర్‌రెడ్డి
ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
మాక్ అసెంబ్లీలో చిన్నారులతో రేవంత్
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
IMAGES