• Samayam News
  • Telugu News
  • destinations
  • India's Most Beautiful Villages That You Must Visit Once In Your Life 2020

ఇండియాలో అత్యంత అందమైన గ్రామాలు ఇవే... ఎప్పుడైనా చూసారా?

భారతదేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు అని, ఈ భూమ్మీద అత్యంత అందమైన గ్రామాలు కొన్ని మన దేశంలోనే ఉన్నాయని చెబుతుంటారు. ఈ గ్రామాల గురించి తెలుసుకుంటే మీరు కూడా సరిగ్గా ఈ మాటలతో ఏకీభవిస్తారు. భారతదేశం యొక్క అసలైన అందాన్ని, ఆధునికత అంటుకోని సామాన్య గ్రామీణ జీవనాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ఈ గ్రామాలను చూస్తే మీరు ఓ పాత ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి చెందుతారు. గొప్ప సంస్కృతి, ఆచరణల కారణంగానే వీటికి ఈ ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. సాధారణ పర్యాటక మార్గాలకు దూరంగా దాగి ఉన్న ఈ గ్రామాలను అన్వేషించడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నగర జీవితానికి దూరంగా శాంతి, ప్రశాంతతను చేకూర్చే ఈ అందమైన గ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతకీ ఆ గ్రామాలు ఏమిటి ఎక్కడ ఉన్నాయి అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం..

indias most beautiful villages that you must visit once in your life 2020

​జంజెలి, హిమాచల్ ప్రదేశ్

​జంజెలి, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని ఈ చిన్న జంజెలి గ్రామం దేశంలోని అత్యంత సుందరమైన గ్రామాల్లో ఒకటి. మండి జిల్లాలో ఉన్న ఈ గ్రామం నగర వాణిజ్య జీవనానికి దూరంగా, ప్రశాంతతను కోరుకునే వారికి గొప్ప గమ్యస్థానంగా నిలుస్తుంది. ఇక్కడి రోడ్ల వెంబడి ఉండే కేఫ్ లు లేదా దుకాణాల వద్ద కూర్చుని సూర్యుడి వెలుగులో సేదతీరడం ఎంతో హాయిగా అనిపిస్తుంది. శిఖరి మాత దేవాలయం వంటి అనేక ఆలయాలను ఇక్కడ సందర్శించవచ్చు. సాహస ప్రేమికులకు హైకింగ్, ట్రెక్కింగ్, నైట్ సఫారీ వంటి అనేక బహిరంగ క్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి.

​మవ్లినాంగ్, మేఘాలయ

​మవ్లినాంగ్, మేఘాలయ

మేఘాలయ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన చిన్న గ్రామం మవ్లినాంగ్. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రంగా ఉండే గ్రామంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రామంలో శుభ్రతను చూస్తే మీరు ఆశ్చర్యపడకమానరు. ఈ గ్రామాన్ని అన్వేషించడంతో పాటు అక్కడి స్థానికులను ప్రేమగా పలకరించడం ద్వారా వారి జీవన విధానం, సంస్కృతి గురించి మరింత తెలుసుకోవచ్చు. సందర్శకులకు ఆ గ్రామస్తులు ఎంతో సాదరంగా ఆతిధ్యమిస్తారు. పర్యావరణ హితంగా జీవిస్తున్నందుకు వారెంతో గర్వపడతారు. ఈ గ్రామంలో ఎత్తైన టవర్ ఎక్కి 360 డిగ్రీల కోణంలో గ్రామ అందాలను వీక్షించవచ్చు. వెయ్యి సంవత్సరాలకు పైగా వయస్సు కలిగిన వృక్షాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.

​మలన, హిమాచల్ ప్రదేశ్

​మలన, హిమాచల్ ప్రదేశ్

కుల్లు వ్యాలీలో ఉన్న అందమైన ప్రాచీన గ్రామం మలన. ఇక్కడి నుంచే నాణ్యమైన మలన క్రీమ్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ గ్రామంలో కొద్ది మంది మాత్రమే నివసిస్తున్నప్పటికీ సాహస ప్రేమికులకు, పర్వతారోహకులకు ఇది ప్రముఖ గమ్యస్థానంగా మారింది. తాజా గాలి, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల కోసం మలనను తప్పకుండా సందర్శించాలి. ఇక్కడి ప్రజలు వారి ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను, ప్రాచీన పద్ధతులను ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటారు. సౌకర్యవంతమైన పర్యటన కోసం కుల్లులో హోటల్ గదిని బుక్ చేసుకుని ఇక్కడికి వెళ్లి రావచ్చు.

​రవంగ్లా, దక్షిణ సిక్కిం

​రవంగ్లా, దక్షిణ సిక్కిం

స్వచ్ఛమైన ప్రకృతి అందాలతో, మంచుతో కప్పబడిన కాంచన్ జుంగా పర్వత శిఖరాల నేపధ్యంలో రవంగ్లా గ్రామం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఉత్కంఠభరితమైన లోయలు, లోతైన హిమాలయన్ అడవులతో నిండి ఉండే ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు ఓ స్వర్గధామంలా అనిపిస్తుంది. వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలంతో ఈ ప్రాంతం సందర్శకుల మనసు దోచుకుంటుంది. అంతేకాదు ఇక్కడ అనేక రకాల అరుదైన హిమాలయన్ పక్షులను కూడా చూడవచ్చు. పక్షి ప్రేమికులు దీనిని ఎంతో ఇష్టపడతారు.

​నకో, లాహౌల్ స్పితి

​నకో, లాహౌల్ స్పితి

అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ చిన్న కుగ్రామంలో అన్వేషించేందుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇండియా-చైనా సరిహద్దు వెంబడి ఉండే నకో గ్రామం సుందరమైన సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలతో నిండి ఉంటుంది. శీతాకాలంలో ఈ గ్రామం పూర్తిగా మంచుతో కప్పబడి కనిపిస్తుంది. ఆ సమయంలో స్కీయింగ్ వంటి క్రీడలకు ఇది అనువైన ప్రదేశంగా మారుతుంది. పురాతన మఠాలు, బోటింగ్ వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి.

Read Also: ఇండియా చిట్టచివరి గ్రామం 'మనా' గురించి మీకు తెలియని విషయాలు

​లచెన్, సిక్కిం

​లచెన్, సిక్కిం

సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో లచెన్ గ్రామం ఉంటుంది. ఈ అందమైన గ్రామం గురించి సిక్కిమీస్ ప్రభుత్వం ఇప్పటికే పెద్ద స్థాయిలో ప్రచారం కూడా చేస్తుంది. దేశంలోని అత్యంత సుందరమైన దృశ్యాలను అందించే గ్రామాల్లో ఒకటైన లచెన్ లో మంచు పర్వత శిఖరాలు, పచ్చని వాతావరణం సందర్శకులను మైమరపిస్తాయి. ప్రాచీన మఠాలతో పాటు గొప్ప ట్రెక్కింగ్ ట్రయల్స్ ను కూడా ఇక్కడ ఆనందించవచ్చు. గొర్రెలు, యాక్ ల నుంచి ఉన్ని నూలు ఎలా తయారు చేస్తారనే అంశాలను మీరు ఇక్కడ ప్రత్యక్ష్యంగా చూసి తెలుసుకోవచ్చు. సాహసాల పట్ల ఆసక్తి గల వారు యుమ్తాంగ్ వ్యాలీ నుంచి రెండు రోజుల ట్రెక్ ద్వారా ఈ గ్రామానికి వెళ్లవచ్చు. లచెన్ లో వసతి కోసం హోటల్ సదుపాయం కూడా ఉంటుంది. వీటిని ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు.

​చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్

​చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్

ఇండో-చైనా సరిహద్దులో ఉన్న మరో గ్రామం చిట్కుల్. అద్భుతమైన మంచు పర్వతాల దృశ్యాలను ఈ గ్రామం అందిస్తుంది. ఉత్కంఠభరితమైన ప్రకృతి అందాలకు ఇది ప్రవేశ ద్వారంలా అనిపిస్తుంది. నిర్మలమైన వాతావరణం, పర్వతాలు, పచ్చిక భూములు, నదులు, అరణ్యాలతో చిట్కుల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సందర్శకులు ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారు. బుద్దిస్ట్ ఆలయంతో సహా అనేక ప్రధాన ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. అడవుల్లో పర్వతారోహణతో పాటు అభయారణ్యం సందర్శన కోసం ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు.

​జీరో, అరుణాచల్ ప్రదేశ్

​జీరో, అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ లోని జీరో వ్యాలీలో జీరో గ్రామం ఉంది. పైన్ కొండలు, సుందరమైన గట్లు, వరిపొలాలతో నిండిన అన్యదేశ గ్రామం ఇది. అద్భుతమైన వృక్షజాలం, జంతుజాలంతో ఈ గ్రామం నిండి ఉంటుంది. అంతేకాదు సాహసాలను ఇష్టపడే వారు పర్వతారోహణలతో పాటు మంత్రముగ్ధుల్ని చేసే గుహలను కూడా అన్వేషించవచ్చు. ప్రకృతి, సాహస ప్రేమికులకు ఇది ఓ స్వర్గంధామం అని చెప్పవచ్చు. మీరు ఇక్కడి గిరిజన జీవనం గురించి తెలుసుకోవాలంటే జీరో వ్యాలీలో ఒళ్లంతా పచ్చబొట్లతో నిండి ఉండే అపటని గిరిజనులను కలుసుకోవాలి. తద్వారా మీరు వారి సంస్కృతి, సాంప్రదాయాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. తల్లీ వ్యాలీ వన్యప్రాణి అభయారణ్యం వంటి అనేక ప్రదేశాలు ప్రకృతి, వన్యప్రాణుల యొక్క గొప్ప దృశ్యాలను అందిస్తాయి.

Read Also: ఇండియాలో అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన అద్భుతమైన ద్వీపాలు

సూచించబడిన వార్తలు

అందుబాటు ధర.. అదరగొట్టే ఫీచర్లతో.. టాటా నానో ఎలక్ట్రిక్ కార్‌ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడో తెలుసా?

మన కవితలు™

  • Submit Your Quotes
  • REQUEST HERE
  • TERMS & CONDITIONS

పల్లెటూరు కవితలు | Palle (Village) Kavithalu

 palle (village) kavithalu in telugu..

Read More Palle (Village) Kavithalu >

"మాది ఒక చిన్న పల్లెటూరు , ఎక్కడ చూసిన పచ్చని పొలాలు . ఊరంతా చిన్న చిన్న రైతులు , వాళ్లే దేశానికి అన్నదాతలు.

Palle (Village) Kavithalu

 Palle (Village) Kavithalu in English.

Maadi oka chinna palleturu, Ekkada chusinaa Pachani polalu Urantaa chinna chinna raithulu Valle deshaniki annadaatalu Maa oori nindaa gudiselu O deepame maa velugulu Maa ooriloni prajalu Anuragaalu aapyayatalaku maarurupalu Maa palletoori vatavaranam Devudu maakichina goppavaram Kashtasukhallo todu unde prajalu Kanti paapalaa chuse peddadikkulu Prati intiki paadipashuvulu Pallello nivasinche moogajeevalu Suryuni bhaga bhaga mande kiranalu Prajala onti nindaa shrama-chematalu Eppudu chusinaa prajala kashtalu Ive palletoori prajala jeevitaalu Eppudu karunistado aa devudu Appude sukhalaku lonavutayi maa jeevithalu…" . . . . Ramesh Reddy (Sircilla)…

Twitter

AUTHOR: Manakavitalu Team

author-avatar

Popular$type=one

' border=

మా గురించి:

  • Publish Kavithalu Online
  • App Privacy Policy

Footer Social$type=social_icons

గమనిక:.

Palle Kavithalu: పల్లె కవితలు

Palle Kavithalu: పల్లె అనగానే మనకు ఠక్కున గుర్తువుకు వచ్చేది పచ్చని పొలాలు, చెరువు, కాలుష్యం లేని పల్లె వాతావరణము… ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో గుర్తొస్తాయి. మన ఊరి గురించి రాసిన కవితలే ఈ పల్లె కవితలు!

మల్లె చెరువు – కవిత

ఉదయం – సాయంత్రం – కవిత, palletoorlu – pattanaalu – kavita, anantamrutam – telugu kavita, maa uru – telugu kavita, ne pallenu takaanantu – telugu geetam (lyrics).

IMAGES

  1. essay on village in telugu//10 lines on village in telugu

    essay about beauty of village in telugu

  2. Essay on Beauty of Village in Telugu

    essay about beauty of village in telugu

  3. Essay on village nature in telugu

    essay about beauty of village in telugu

  4. My village essay in telugu

    essay about beauty of village in telugu

  5. About village in Telugu

    essay about beauty of village in telugu

  6. Poem On Beauty Of Village In Telugu

    essay about beauty of village in telugu

VIDEO

  1. The Village Webseries REVIEW

  2. Beauty of Konaseema ❤️

  3. The Village Review Telugu

  4. Essay on A visit to a village

  5. ఏడ్లను మేపక పోతే

  6. SUNDARI (HD) Superhit Telugu Released Indian Full Hindi Dubbed Romantic Love Story Movie